తెనుగు భాష;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ప్రపంచంలో ఎవరికైనా  మాతృమూర్తి పైన మాతృదేశం పైన ప్రేమలేని వారు ఏ ఒక్కరు ఉండరు  ఆంధ్రులకు ఆంధ్రదేశం అంటే ఇష్టం ఆంధ్ర భాష అంటే ప్రాణం అలా అని ఇతర భాషలను ఇతర రాష్ట్రాలను చిన్నచూపు చూడవలసిన అవసరం లేదు దేని ప్రత్యేకత దానికి ఉన్నది  ఆంధ్ర ప్రజానీకం మొదట  మూడు కొండల మధ్య నివసించిన వ్యక్తులు  వ్యవహరించే భాషను తెనుగు అని చెప్పారు.  భూమిని పార్వతీదేవిగా  కొలుస్తారు  పార్వతి దేవి అందరికీ తల్లి గనుక దీనిని అమ్మ భాష అంటున్నారు. దీనికి 36 అక్షరాలు మాత్రమే ఉంటాయి  అమ్మ తరువాత నాన్నకు  ప్రధాన స్థానం ఇస్తోంది సమాజం  మా నాన్న శివ స్వరూపం  మూడు కొండలపైన ప్రతిష్టించబడి ఉన్న దైవం
అమ్మను దర్శించుకున్న తరువాత  నాన్నను చూడాలనిపిస్తుంది అమ్మ తరువాత ప్రధాన స్థానం నాన్నదే కదా  వారి దర్శనానికి వెళ్ళడానికి కొండను ఎక్కాలి ఆ కొండకు 19 మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క సంస్కృత అక్షరాన్ని అప్పు తీసుకొచ్చి మన  భాషలో కలుపుకున్నాం  అంతకు ముందు ఉన్న 36 అక్షరాలకు ఈ పంతొమ్మిది అక్షరాలు కలిస్తే మొత్తం 55 అక్షరాలవుతాయి  కొండ చివరి వరకు వెళ్ళిన తర్వాత  శివ స్వరూపాన్ని చూసి  పూజ చేసి రావడం   ఆనవాయితీ  అమ్మ నాన్న తరువాత  వారి సంతానం ముఖ్యం  శివ పార్వతులకు ఉన్న ఏకైక సంతానం గణపతి  ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క   భగవంతుడు ప్రతిగా ఉంటాడు  అష్టదిక్పాలకులకు ఏకైక ప్రభువు గణపతి. పార్వతి దేవి భూమి అనుకుంటే శివ స్వరూపం ఆకాశానికి ప్రతినిధిగా ఉంటే భూమిని ఆకాశాన్ని కలిపే ఏకైక వ్యక్తి గణపతి మాత్రమే  వారి పేరుతో ప్రాకృతం నుంచి  శకట రేఫాన్ని తీసుకొని వచ్చి 56 అక్షరాలుగా చేసి  దానిని ఆంద్ర భాష అని పిలిచాము ప్రస్తుతం మనం మాట్లాడుతున్నది ఆంధ్ర భాష  పరిణతి చెందిన పరిపూర్ణ భాషగా ఆంధ్రభాష వర్ధిల్లుతుంది  ప్రపంచ  భాషలలోనే ప్రథమ స్థానంలో ఉన్నది మన ఆంధ్ర భాష  మన వారు ఎవరైనా ఇతర భాషలను నేర్చుకోవాలి అంటే  ఆ భాషను ఆంధ్ర భాషలోకి అనువదించుకొని మెదడు  జ్ఞాపకం పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మరిచిపోకూడదు  ప్రత్యేకించి అజంత భాష అయిన  ఆంధ్ర భాషలో మాట్లాడుతూ ఉన్న ప్రతి వ్యక్తి ఆంధ్రుణ్ణి అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు.
(ఆంధ్ర భాషా దినోత్సవ సందర్భంగా)


కామెంట్‌లు