చురుకైన మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
నీటి బుడగ జీవితం
చాట మడుగు యవ్వనం
ఏదైనా ఏమైనా
నెగ్గేడి దుడుకుతనం

పసి వయసున ఆట తనం
వృద్ధాప్యపు గడుసుతనం
ఔనన్నా కాదన్నా 
యవ్వనాన ఉడుకుతనం

కాల చక్ర సంగ్రామం
లెక్కించదు లేడి తనం
హుషారైన పరుగులతో
జగమేలును చురుకుతనం


కామెంట్‌లు