131
నన్ను శివభక్తితో కొలిస్తే ముక్తి లభించును
బసవేశ్వరుణ్ణి తలిస్తేనే మోక్షంలభించును
భక్తులు నాకొరకు సర్వమర్పిస్తారని అనెను
బసవడు భక్తులకై సర్వం సమర్పిస్తాడనెను
"బసవ"నామమే నా స్వరూపమనె శివుడు విఠల!
132
బసవా!భూలోకవాసమెలావుందనె శివుడు
భువిపైన శివ భక్తులున్నారా అని అడిగాడు
శివా!నేనొక్కడినే నీ భక్తుడిని అని అన్నాడు
ప్రతి శివ శరణుడు నీవే అని చెప్పె బసవడు
భూమి మొత్తం శివమయమనె బసవన్న విఠల!
133
దేవతలు బసవని మాటలను విన్నారు
వారందరు కలిసి హర్షధ్వానాలు చేశారు
వారు బసవేశ్వరునెంతో మెచ్చుకున్నారు
వారు బసవను దీవించి దేవలోకానికెళ్లారు
ఇదంతా సిద్ధిరామయ్య భక్తులకు చెప్పె విఠల!
134
ఒక శివ శరణుడు బసవన్న చెంతకొచ్చాడు
తనకు సమస్త ధనము కావాలని అడిగాడు
చిరునవ్వుతో తన ధనమంతా భక్తునికిచ్చాడు
ఓ భటుడు వెళ్లి బిజ్జలనికీ విషయము చెప్పాడు
బసవనికి బిజ్జలుడు లెక్క చూపమనెను విఠల!
135
నీ డబ్బుతో నాకు పని లేదని అన్నాడు
శివభక్తియే నాకు కల్పతరువని అన్నాడు
గురుభక్తియే కాంచన పర్వతమని అన్నాడు
భక్తియే చింతామణి కామధేనువని అన్నాడు
భక్తుడు పరధనానికాశపడడనె బసవడు విఠల!
136
సింహం ఎప్పుడైనా గడ్డిమేస్తుందా అన్నాడు
రాజహంస గోతినీళ్లు తాగుతుందా అన్నాడు
చిలుక బూరుగుపళ్లను తింటుందా అన్నాడు
చకోరము చీకటిని ఆస్వాదిస్తుందా అన్నాడు
మధుపం పిచ్చిపువ్వు కోరదనె బసవడు విఠల!
137
రాజా!ధనంతో నాకు పనిలేదని అన్నాడు
బసవడు భక్తుల ధనమే నా ధనమన్నాడు
నేనిచ్చినది వారి ధనసంపదేనని అన్నాడు
నేను వారి డబ్బు వారికిచ్చానని అన్నాడు
కావాలంటే లెక్క చూసుకొమ్మనె బసవడు విఠల!
138
రాజు,ధనాగారపు తాళాలు తెప్పించాడు
ధనాగారంలోని ధనము లెక్క బెట్టించాడు
ఉన్నదానికన్నా ఎక్కువ ధనముందన్నాడు
అది చూచిన బిజ్జలుడు నిర్ఘాంతపోయాడు
ధనము లెక్క పెట్టడం కష్టమయ్యెను విఠల!
139
భక్తులు బసవేశ్వరునెంతో మెచ్చుకున్నారు
ఓ మహాశివభక్తుని గురించి చెప్పుకున్నారు
పాండ్యరాజు మంత్రి గూర్చి కూడ చెప్పారు
వారు మంత్రి-గుర్రాల కథను వివరించినారు
వారు శివభక్తి విశిష్టతను కొనియాడిరి విఠల!
140
పూర్వం మధురను పాండ్యుడు పాలించాడు
అతని దగ్గర శివభక్తుడైన మంత్రి వుండేవాడు
మంత్రికి గుర్రాలను కొనమని ధనమునిచ్చాడు
అతడు దాన్ని జంగమార్చనకు వినియోగించాడు
రాజు మంత్రికి గుర్రాలెక్కడున్నవని అడిగె విఠల!
నన్ను శివభక్తితో కొలిస్తే ముక్తి లభించును
బసవేశ్వరుణ్ణి తలిస్తేనే మోక్షంలభించును
భక్తులు నాకొరకు సర్వమర్పిస్తారని అనెను
బసవడు భక్తులకై సర్వం సమర్పిస్తాడనెను
"బసవ"నామమే నా స్వరూపమనె శివుడు విఠల!
132
బసవా!భూలోకవాసమెలావుందనె శివుడు
భువిపైన శివ భక్తులున్నారా అని అడిగాడు
శివా!నేనొక్కడినే నీ భక్తుడిని అని అన్నాడు
ప్రతి శివ శరణుడు నీవే అని చెప్పె బసవడు
భూమి మొత్తం శివమయమనె బసవన్న విఠల!
133
దేవతలు బసవని మాటలను విన్నారు
వారందరు కలిసి హర్షధ్వానాలు చేశారు
వారు బసవేశ్వరునెంతో మెచ్చుకున్నారు
వారు బసవను దీవించి దేవలోకానికెళ్లారు
ఇదంతా సిద్ధిరామయ్య భక్తులకు చెప్పె విఠల!
134
ఒక శివ శరణుడు బసవన్న చెంతకొచ్చాడు
తనకు సమస్త ధనము కావాలని అడిగాడు
చిరునవ్వుతో తన ధనమంతా భక్తునికిచ్చాడు
ఓ భటుడు వెళ్లి బిజ్జలనికీ విషయము చెప్పాడు
బసవనికి బిజ్జలుడు లెక్క చూపమనెను విఠల!
135
నీ డబ్బుతో నాకు పని లేదని అన్నాడు
శివభక్తియే నాకు కల్పతరువని అన్నాడు
గురుభక్తియే కాంచన పర్వతమని అన్నాడు
భక్తియే చింతామణి కామధేనువని అన్నాడు
భక్తుడు పరధనానికాశపడడనె బసవడు విఠల!
136
సింహం ఎప్పుడైనా గడ్డిమేస్తుందా అన్నాడు
రాజహంస గోతినీళ్లు తాగుతుందా అన్నాడు
చిలుక బూరుగుపళ్లను తింటుందా అన్నాడు
చకోరము చీకటిని ఆస్వాదిస్తుందా అన్నాడు
మధుపం పిచ్చిపువ్వు కోరదనె బసవడు విఠల!
137
రాజా!ధనంతో నాకు పనిలేదని అన్నాడు
బసవడు భక్తుల ధనమే నా ధనమన్నాడు
నేనిచ్చినది వారి ధనసంపదేనని అన్నాడు
నేను వారి డబ్బు వారికిచ్చానని అన్నాడు
కావాలంటే లెక్క చూసుకొమ్మనె బసవడు విఠల!
138
రాజు,ధనాగారపు తాళాలు తెప్పించాడు
ధనాగారంలోని ధనము లెక్క బెట్టించాడు
ఉన్నదానికన్నా ఎక్కువ ధనముందన్నాడు
అది చూచిన బిజ్జలుడు నిర్ఘాంతపోయాడు
ధనము లెక్క పెట్టడం కష్టమయ్యెను విఠల!
139
భక్తులు బసవేశ్వరునెంతో మెచ్చుకున్నారు
ఓ మహాశివభక్తుని గురించి చెప్పుకున్నారు
పాండ్యరాజు మంత్రి గూర్చి కూడ చెప్పారు
వారు మంత్రి-గుర్రాల కథను వివరించినారు
వారు శివభక్తి విశిష్టతను కొనియాడిరి విఠల!
140
పూర్వం మధురను పాండ్యుడు పాలించాడు
అతని దగ్గర శివభక్తుడైన మంత్రి వుండేవాడు
మంత్రికి గుర్రాలను కొనమని ధనమునిచ్చాడు
అతడు దాన్ని జంగమార్చనకు వినియోగించాడు
రాజు మంత్రికి గుర్రాలెక్కడున్నవని అడిగె విఠల!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి