తార;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 క్షణికావేశంలో సమతౌల్యాన్ని కోల్పోకూడదు కానీ విధి నియతి ప్రకారమే అన్నట్లుగా వాలి తన పద్ధతిని మార్చుకోలేదు  తార పట్ల సత్ప్రవర్తనను కూడా చూపలేదు  పతి భక్తిని గౌరవించలేదు వారి తీరును గమనించిన తార చేసేదేమి లేక మహాసాద్వి మణి లాగా తన భర్తను దీర్ఘాయువును విజయమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తుంది. తార యొక్క ఈ ఉత్తమోత్తమ నడవడికను గుర్తించి  ప్రియ వాదిని అని రక్షణ (అనుకూలం) అని వర్ణించాడు వాల్మీకి మహర్షి  రానున్న ఉపద్రవాన్ని గుర్తించిన తార బాధాతప్త హృదయంతో పరిస్థితులతో రాజీపడి తన నివాసానికి వెళ్ళిపోతుంది వెళ్ళే ముంది తన భర్తకు ప్రదక్షణం చేసి సెలవు తీసుకుంటుంది అంతః పురంలోకి వెళ్లి క్షణక్షణం లెక్కిస్తూ కాలాన్ని గడుపుతుంది  ఈ విధంగా ప్రధమంగా చూసిన తార ప్రశాంతత  సమతుల పతి భక్తి పరాయణురాలుగా కనిపిస్తుంది. తార నిజంగానే మన ముందు దృవ తారగా నిలుస్తుంది ఆమె వెలుగు లోకానికి వెలుగుగా ప్రతిబింబిస్తుంది ఈ వెలుగు  లోకాన్ని అవగతం చేసుకోవడమే అవుతుంది   వాలి అతంకిక అంతం సమీపిస్తున్న సమయంలో తార మళ్ళీ కనిపిస్తుంది. తారశోక మూర్తి రూపంలో తన భర్త వాలి శరీరం పై వాలి పోతుంది తన భర్త మరణంతో ఆయనకు అశ్రుతర్పణం సమర్పించుకొని తన దుఃఖిత హృదయాన్ని శాంత పరచుకునే ఉద్దేశంతో యుద్ధభూమి వైపు పరుగులిడుతుంది వానర రాజు వాలి పార్థివ శరీరాన్ని కాంచి వానర సమూహం దుఃఖంతో కృంగిపోతోంది రామచంద్రుని రణవీర ముఖముద్ర అందరినీ భయభ్రాంతులను చేస్తుంది ఈ  ప్రయాణక దృశ్యాన్ని చూసిన వానరులు దశ దిశలలో చల్లా చెదరయిపోతారు  తారను కూడా వారి యుద్ధ భూమి వైపు వెళ్ళవద్దని వారిస్తారు.కానీ వీరనారితార ఏమాత్రం లెక్కచేయక నిర్భయంగా వెళ్లి తన భర్త పాదాలకు నమస్కరించుకునే ఆదుర్దాతో ప్రవేశిస్తుంది రాముని ఒక్క బాణంతో ఇంతటి మహావీరుడు ఎలా నెలకు వొరిగాడో  తార ఊహకు అందలేదు  రామలక్ష్మణ సుగ్రీవులను లెక్కచేయకుండా తార తన భర్త పాదాలను స్పృశించి ఈ శరీరాన్ని ఆ లింగనం చేసుకోవడానికి ప్రయత్నించింది వారి వక్ష స్థలంలోకి దూసుకెళ్లిన బాణమే ఆ పతి పత్నుల పరిరంబానికి విఘాతం కలిగించింది ప్రపంచాన్నే ఒక్క   పెట్టున జటిలించుకోగల వీర యోధులు ఒక క్షణంలో ఇలా నేలకూలడం తార  జీర్నించుకోలేక పోతుంది తాను ఎంత వారించినా మన్నించకుండా విధివశాత్తు ఇలా కూలిపోవడం మరీ మరీ  దుఃఖ క్రాంతు రాలిగా చేసింది ఇంతటి ఘోర దృశ్యాన్ని చూసి ఈ దారుణ మృత్యు గోషలో కూడా తార తనమనో నిబ్బరాన్ని కోల్పోలేదు.

కామెంట్‌లు