ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మీరందరూ దూరంగా తొలగిపొండి వెను తిరిగి చూడవద్దు చూసిన మరు క్షణాన మీ ప్రాణాలు పోతాయి  దొంగ చాటుగా చూసిన ఐదు ఆరుగురి ప్రాణాలను తీస్తాడు అగ్గిరాజు. వారు దూరంగా వెళ్లిన తర్వాత  వారు పడవేసిన ఆయుధాలను అన్నిటిని ఒకచోట చేర్చి కట్టగా కట్టి  కాలిబాటలో వాటిని తీసుకొని వెళ్ళాడు  దూరంగా కనిపించిన ఆ సేనకు మరలా హెచ్చరిస్తూ  తిరిగి ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే మీ ప్రాణాలు  మీకు దక్కవు జాగ్రత్త  కాలిబాటలో ముందుకు నడిచి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చాడు. తన సహచరులు ఐదుగురు  ఆయుధాలను  తమ శిబిరానికి చేరవేశారు. బ్రిటిష్ సైన్యం వారు వెర్రి ముఖాలతో  వెనుకకు తిరిగి చూడకుండా పారిపోయారు. వారు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిన తరువాత  ఆ వనాన్ని వదిలి కత్తులను కట్టిన మూటలతో  వీరులందరూ రాజు గారి దగ్గరకు వచ్చారు  అగ్గిరాజు వ్యూహాలను ఆలకించిన రాజు  అతనిని పొగడడం  అగ్గిరాజు పొంగిపోవడం  ప్రజల సేవకు ముందుకు పరిగెత్తువాడు అగ్గిరాజు  తుఫాను గాలికి చెట్లు ఎలా  పడిపోతాయో అవతల ఎంత సైన్యం ఉన్నా సాహసంతో వెళ్లి  ఆస్తులను కాపాడాడు  విప్లవ వీరుల విజయ విహారం  ఆపడం కోసం ఏ దారి బోధపడక  కోయ చెంచులే వారికి ఆహారములను ఇచ్చి పోషిస్తూ ఉన్నారు  వారందరు కూడా లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. వారి  ఇండ్లను మొత్తం వెతికి  వారి ఆహారాన్ని  యూనిటీ ఫండ్ జప్తు చేసి  బండ్ల పైకి ఎక్కించారు. దానికి కాపలా కాచి అడవిలో ఆహారం లేక అలమటించే ప్రజలకు  ఆహారాన్ని పంచమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు  రాజు గాడు చెప్పినట్లే వారందరూ చేశాడు  దొరల పసిగట్టినటువంటి వీర వరులు  సైనికులకు అందేటటువంటి సైనికులను అడ్డగించి కాపు కాసి కొండల ఘాటులలో ఉన్న  తమ సోదరులకు  ఆహారాన్ని చేరుస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రదేశంలోనే అందాల సీమ  అతి రమ్యమైనది అరకు లోయ  మన్య భూమిని చేరడానికి అది మంచి మార్గం  బండ్లు రావడానికి బాటలు కూడా ఉన్నాయి  ఆ బాటల్లో ఏడు వంపుల గాడ్ అతి ముఖ్యమైనది ఆ అడవిలో ఆ బాటలో నడిచి ఆహారాలను  బండ్లపై సైనికులు శిక్షణతో వరుసగా వచ్చినట్లుగా  వస్తున్నారు మన్య వీరులు.



కామెంట్‌లు