ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మీరు ఎక్కడకు రమ్మంటే అక్కడకు  నా రాకడ తెలియజేస్తాను  ఎక్కడకు రావాలో మీరే తెలియచేయండి అని  వ్రాసిన ఉత్తరాన్ని చూసి  ఆ అరణ్యాల్లో ఒక చోటు చెప్పి వారందరూ కూడా అక్కడికి వచ్చారు  తన  మొహంలో ధీరత్వం కనిపిస్తూ  మదపు టేనుగు  నడిచి వచ్చినట్టుగా ఆ ప్రాంతానికి వచ్చాడు రాజు  మొనలో బాణముల కట్ట  కూలి మోపు పైన  కట్టి ఎడమ చేతిలో వెదురు వీళ్లు పట్టి  మొనను ఉపయోగించి  మోకాళ్ళపై వరకు కాషాయ వస్త్రాన్ని  కట్టి  నడికట్టు బిగించి  మొహం పైన తిరుమని తీర్చిదిద్ది  కుడి కంటిని చేరి  వస్తూ ఉన్న రాజును చూశాడు వారు అంత  స్వామియా లేక రామరాజా వచ్చేది  అనుకుంటూ లేచి నిల్చుండిపోయారు  స్వాగతం చెప్పి శాల్యూట్ చేశారు  అతని ఠీవి చూసి అదిరిపోయిన దొరలు ఆసనం ఇచ్చి మర్యాద చేశారు.
రూథర్ ఫోర్డ్ రాజుకు ఎదురుగా కూర్చుని హలో హలో అంటూ పలకరించాడు  అతని పలకరింపుతో అతని మొహాన్ని చూసి  తన మొహం పై లేత నవ్వులు చిందులు వేయగా  మధుర మందస్వరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు  సర్కారు సేవలో నీకు క్షేమమా  అని పలికిన రాజుతో అతడు ఏమంటున్నాడంటే  నిలువనీయకనీయుల వెంట పడగా క్షేమమెట్లు కలుగును చింత తప్ప  నీ కారణంగా కంటికి నిద్ర కరువైపోయింది  అనే పలుకుతున్న  దొరను చూసి నవ్వుకుంటూ  దానికి ముందు మహాభారతంలో ఉన్నది  చెప్తాను విను  ఆ కథ మొత్తం  విధురుడు చెప్పాడు  ధర్మ తత్వాన్ని గురించి దృతరాష్ట్రునితో చెప్పిన మాటలు  అవి  పరదానములను పరసతులను కోరేటువంటి మరియు కలుషత్మకుడైన ఏ ఒక్కరికి   నిద్ర రాకపోవడం సహజం  అది కరువైపోతోంది. వాళ్లకు శాంతి దొరకదు  కనుక పర  సొత్తుకు ఆశపడకుండా బ్రతకాలి  మహారాజా అని చెప్పాడు  నీ మనసులో ధర్మాన్ని వీడి  ఆలోచించే మీకు  నేను నిద్ర రాదు  శాంతి ఉండదు  కనుక ధర్మ మార్గంలో ప్రవర్తించమని చెప్పిన  మాటలు విని రూథర్ ఫోర్డ్  మనసు ఊగి సలాడుతూ మాట పెగలక అలాగే చూస్తూ ఉండిపోయాడు  చదివిన నా చదువులన్నీ వ్యర్థమైపోయాయి ఇతడు ఎంత ఘనుడు కాకపోతే  నా మనసును ఇంత గాయపరుస్తాడు  అని ఆలోచిస్తూ రాజుతో  రాజా పర ధనములు మాకు ఎందుకు  మా రాజ్యంలో సొత్తు మాదే కదా  దొరతనాన్ని ఎదిరిస్తూ నేరాలు చేస్తున్న మీకు నీతులు ఉన్నాయా  అనగానే  ఆ దొరను చూసిన కన్నులు  రుద్రుని వలె అరుణ కాంతులల మెరుస్తూ కనిపించాయి  పని గట్టుకొని ఆ వీరుడు  దొరతో ఇలా చెప్తున్నాడు.


కామెంట్‌లు