తార;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322

 ప్రశాంత చిత్తంతో ప్రసన్నవదనంతో తార లక్ష్మణుని ఇలా అడుగుతుంది మీకు ఎందుకు ఇంత కోపం వచ్చింది మీకెవరు కోపం తెప్పించువారు లేరు. మీ ఆజ్ఞల ఉల్లంఘించువారు అంతకన్నా ఎవరూ లేరు ఆడవి లో ఉన్న నిప్పుతో ఎవరూ చెలగటం ఆడరు కదా అది వినగానే లక్ష్మణుడు సుగ్రీవుని నిర్లక్ష్యాన్ని గురించి ప్రశ్నించాడు తార వినంభ్రంగా  ఇలా చెప్తుంది ఇది నిజమే సుగ్రీవుడు సోమరియైపోయాడు కానీ అతను తన కర్తవ్యాన్ని విస్మరించివాడు కాడు. కొత్త రాజ్యాధికారంతో కొత్త మత్తు విలాసంలో మాంద్యం కలగడం సహజమే కదా  కామ వాసనలకు జవాబు క్రోధం కారాదు కదా సుగ్రీవుడు సదా శ్రీరాముని పట్ల కృతజ్ఞుడే శ్రీరాముని ఆజ్ఞ సుగ్రీవులకు సదాశిరోధార్యమే శ్రీరాముని క్షేమం కోరి సుగ్రీవుడు తన రుమా తారలను కూడా బలి చేయడానికి సర్వత్రాసంసిద్ధంగా ఉంటాడు. తార తన అనునయంతో లక్ష్మణుని శాంతపరిచి గృహంలోనికి తీసుకొని వెళుతుంది సుందరకాంతల సరస సల్లాపాలలో సందరుడైన సుగ్రీవుడు విలాస వేడుకల్లో తుల తూగుతూ ఉన్నాడు కానీ విశాల నేత్రుడైన లక్ష్మణుని చూడగానే అతని నేత్రాలు కూడా సువిశాలమైనవి లక్ష్మణుని ముఖంలో క్రోధాగ్నిని చూసిన సుగ్రీవుడు చలించి పోయాడు తన ఆసనం వీడి దిగి లక్ష్మణునికి స్వాగతం పలికాడు శ్రీరాముని తీవ్ర సందేశాన్ని లక్ష్మణుడు అమిత క్రోధం తోనే సుగ్రీవునికి వినిపించినప్పుడు  లక్ష్మణుని కోపాన్ని శాంతింప చేయడానికి తార ముందుకు సాగి ఇలా చెప్పింది సుగ్రీవుడు మీరు ఊహిస్తున్నటువంటి వాడు కాదు ప్రస్తుత స్థితిగతుల తీవ్రతను గ్రహించకుండా  సుగ్రీవుని కృతజ్ఞుడని ద్రోహి అని కుటీలుడని అసత్య వాది అని నిష్పలడని అనడం సరికాదు విశ్వామిత్రుడు అంతటి మహాతత్వవేత్త బ్రహ్మవేత్త సైతం మేనక చేతిలో బలి పశువు కాలేదా. సుగ్రీవుడు సామాన్య వానర రాజు ఈ సుఖసంతోషాల క్షణభంగరాలు తాత్కాలికమైన ఈ భోగ లాలసతకంటే తన కర్తవయపరాయణతనే మిన్నగా భావించేవాడు. సుగ్రీవుడు అన్నింటికీ  కన్న  మిన్న ముఖ్యగశయమంటే మహాసాక్షి సుమిత్ర కుమారుడైన మీరు ఇలా ఆలోచించడం విచిత్రంగా ఉంది ఈ విలక్షణ తలంపు మీకు రాకూడదు  అల్పుల తప్పులను క్షమించడంలోనే గొప్ప వారి ఔదార్యం వెల్లి విరుస్తుంది ప్రకాశిస్తుంది  తారా ఇంతటితో ఆగలేదు తన రాజనీతిజ్ఞత వ్యక్తిత్వ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఇలా అంటుంది రావణుడు అంతటి గొప్ప శత్రువును ఎదుర్కోవడానికి సకల ఏర్పాట్లు జాగ్రత్తగా చేసుకోవాలి రావణుని గురించి నేను వారి ద్వారా చాలా విశేషాలు తెలుసుకున్నాను ఈ విశేషాలను మనసులో పెట్టుకుని సుగ్రీవుడు తగిన విధంగా ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నుడై ఉన్నాడు.
కామెంట్‌లు