నన్ను నేను చదవాలి;-అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగాం-9640748497
 ఇతరులను వేలు పెట్టి చూపేముందు నన్ను నేను చదవాలి
ఇతరుల తప్పుల్ని  రంధ్రాన్వేషణ  చేసే ముందు
నాతప్పుని నేను ఏ కరువు పెట్టుకోవాలి
అహం అడ్డొచ్చిన నన్ను నేను సార్వజనీనం చేసుకోవాలి
కొన్ని సందర్భాల్లో నాకేం తెలియనప్పుడు
నేను విద్యార్థిగా 
 నేర్చుకునే ప్రయత్నం చేయాలి
నాకు అన్నీ తెలుసనే
సో కాల్డ్ మేధావితనం
నా నుండి నేను దూరం చేసుకోవాలి
నేను అందరి మనసుల్ని చూరగొనాలి
నేను పదుగురు తలలో నాలుకలా ఉండాలి
నేను కరెన్సీ కట్టల పాముల చుట్టూ తిరిగే అహంభావులకు  దూరంగా ఉండాలి
చేతిలో చిల్లిగవ్వలేకున్నా
బ్రతకడం ఎలాగో నా మనసుకు నేను ఓపాఠంగా నేర్పాలి
నేను మారానని నాకు నేను అనుకుంటే కాదు
నా ప్రాణ స్నేహితులు మానవతావాదులు నా మాట తీరు, నా నడవడి విధానం
నా సేవా దృక్పథం
కొనియాడి నన్ను నన్నుగా చూసిననాడు
రేపు నేనున్నా పోయిన
నేను ఈ భూమి మీద బ్రతికే ఉంటాను
అందుకే నన్ను నేను సంస్కరించుకుంటున్నాను
సమాజాన్ని సంస్కరించడం కంటే వ్యక్తులుగా మనల్ని మనం సంస్కరించుకోవడం సామాజిక చైతన్యానికి
పునాదిరాయి కదా!?కామెంట్‌లు