కవికులము;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఏకులము
మీదంటే
కవికులము
అంటాము2
శ్రీశ్రీది
సినారెది
మాకులమేనంటా2

కర్పూరవసంతరాయలు
నాగార్జున సాగరం
విశ్వంభర కావ్యంతో
విశ్వవిఖ్యాతినొందెను2

అచ్చ తెలుగు మహాకవి
మా సినారె రా--2
మానవతావాదానికి
నిలువెత్తు సాక్ష్యము2

సినిమా పాటకు
సాహిత్య గౌరవం
అద్దినంటి కవి శ్రేష్టుడు
మన సినారెరా2

శ్రీశ్రీ అంటే నే
అభ్యుదయం రా2
ఖడ్గ సృష్టి
పావల
తనరచనలురా2

మహాప్రస్థానం తో
మహాకవిగ మారెనూ 2
కష్టజీవి కుడి ఎడమల్లో
ఉన్నదికవిరా2

అరసం
విరసం
మరసం
ఏదైనను--2
సామాజిక చైతన్యపు
సంఘాలేరా2

ప్రజల పక్షపాతి గదరా
మనకవులంతా--2
కవులంటే
ప్రజలు ఎన్నుకొనని
ప్రజాప్రతినిధులేరా
సామాజిక ఇతివృత్తం--
తమకవితావస్తువుగదరా2


కామెంట్‌లు