నేను ప్రైవేట్ ఉపాధ్యాయుడిని;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
నేను ప్రైవేట్ ఉపాధ్యాయుడిని
ఎప్పుడు వేటుపడునో
 తెలియని వెర్రిబావులోడిని

అధిక వేతనం ఆశించిన,
సంవత్సరానికోసారి ఇంక్రిమెంట్ 
ఇవ్వాలన్నా
వేటు పడక తప్పదు
బోధన వ్యసనమైననాకు
మనసు చంపుకొని
అన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయుడను

విద్యార్థుల దగ్గర వేలు లక్షలు ఫీజులు వసూలు చేసిన
ఉపాధ్యాయుడి  కడుపు కొట్టి
యాజమాన్యం ఖజాన నింపుకుంటున్న వైనం

ఏలినోడు
లక్షల్లో నిరుద్యోగులు ఉంటే
వేలలో ఉద్యోగాలు ఇస్తే
పస్తులుండి చదివిన
ఆ కొలువు రాక
ఇటు కుటుంబం గడవక
పంటి దిగువన
బాధను దిగమింగుకొని
ఏదో అలా బతికిడుస్తున్న
దౌర్భాగ్యుడతడు

ఎంత సీనియారిటీ ఉన్న
ఇక్కడ పప్పులేం ఉడకవ్
శక్తివంచన లేకుండా ఎన్ని గంటలు పనిచేసిన
నిన్ను ప్రశంసించి
ఆకాశానికి ఎత్తి
సన్మాన సత్కారాలు
భుజకీర్తులు ఎవరు అలంకరించరు?!

ఏదో అలా చావలేక బ్రతకలేక
బ్రతుకుతున్న ప్రైవేటు
ఉపాధ్యాయుడిని
కాల ప్రవాహం లో కొట్టుకొని పోతున్న వాడిని

వయసుడిగి
 ఏళ్లకేల్లుగడిచిన
ఇల్లాలు నన్నీసడించుకున్న
బంధువులు రాబంధువులై ‌  నా ఇంటిపై దాడి చేసిన
ఏముంది కనుక నా దగ్గర
ఆత్మీయపు పలకరింపు తప్పా
చదువు నా బ్రతుకు మార్చక
అసహనం నా అణువణువునా
నిండి
నన్నునేను నియంత్రించుకోలేక
నా మీద నాకే
ఎవగింపు పుడుతుంటే
బ్రతుకును గెలవలేక
చావుకై ఎదురుచూస్తున్న
ఒక అభాగ్యుడిని, దౌర్భాగ్యుడను
నా తలరాతను
నేను మార్చుకోలేని
ఒక మామూలు మానవుడిని
ఎలాగో అలా బ్రతకడం
 తప్ప
ఏమి శాసించలేని
నేను సగటు మనిషిని
బలహీనున్ని2


కామెంట్‌లు