చిన్నారులు;- -గద్వాల సోమన్న,9966414580
పిల్లల మనసులు సుమములు
మల్లెమొగ్గలకు సమములు
అల్లరి చూడగ విందులు
ఎల్లరికీ కనువిందులు

మాటలు మల్లెల మాలలు
జాలువారే తేనియలు
కడిగినట్టి ముత్యాలు
వెల్లివిరియను సత్యాలు

చెంగున ఎగిరే బాలలు
ముద్దులొలికే లేగలు
విరులపై వాలు తుమ్మెదలు,
సీతాకోకచిలుకలు

చక్కనైన చిన్నారులు
చంద్రబింబం రూపులు
పవిత్రమైన చూపులు
మహిని మేలుప్రొద్దులు


కామెంట్‌లు