పాపాయి కోరిక;- -గద్వాల సోమన్న,9966414580
తేటినై తెలుగు పూల
మకరందం గ్రోలుతా!
ఏటినై పదిమంది
దాహార్తిని తీర్చుతా!

పాటనై  పలువురికి
వీనుల విందునౌతా!
తోటనై హృదయాలకు
ఆహ్లాదమే ఔతా!

కోటనై అందరికీ
ఆశ్రయ దుర్గమౌతా!
మాటనై మనోవ్యధ
తరిము ఔషధమౌతా!

బాటనై జనవాళిని
గమ్యాన్ని చేర్చుతా!
ఆటనై వికాసమ్ము,
వినోదాన్ని పంచుతా!


కామెంట్‌లు