సున్నితమనస్కుడు;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ
అమ్మ ఇంటిల్లిపాదికి
పనిమనిషే
నాన్న మరీను అమ్మ శ్రమను
అసలే గుర్తించడు?!

తెచ్చిపెడితే వండిపెట్టేదానివి
అని అమ్మ ను ఎప్పడుదెప్పొడిచేటోడు?!
అయినా అమ్మ నాన్న ను పల్లెత్తు మాటనేదికాదు

ఎందుకమ్మా ఇంతమౌనంగుంటవు
అని అమ్మ ను అన్న అడిగినప్పుడు నిజమేగదరా?
నేను ఏం పనిచేస్తున్నాను గనుక మీ నాన్న తెచ్చి పెడితే
తింటున్న గదరా అని
అమ్మనే గమ్మునుండు
అని అన్ననే మందలించింది

నాకు అనిపించింది మాఅమ్మ
ఏంపని చేయట్లేదా?!
వేకువ జామున నిద్ర లేస్తుంది
మమ్మల్ని నిద్ర లేపి
చకచకా తయారు చేసి
చెల్లిని బడికి నన్ను కాలేజీకి
పంపుతది
నాన్న చేసేది వ్యాపారం
 ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా నష్టాలు చవిచూడకతప్పదు
తాను తప్పులుచేసి
ఇంట్లో అమ్మ మీద చిర్రుబుర్రులాడుతాడు
ఇది నేను సహించలేక పోయేటోణ్ణి?!

ఒకసారి అమ్మకు జ్వరమొచ్చి ఎంతకు తగ్గకపోయేసరికి
నాన్న ఎంతవిలవిల్లాడి పోయాడో
మమ్మల్ని దగ్గరి కి తీసుకొని బోరున ఏడ్చాడు
సీత నన్ను క్షమించు అని
నాన్న మంచమీద పడుకున్న
అమ్మ చేయిపట్టుకొని
చంటిపిల్లాడిలా ఏడ్చేసాడు
అప్పుడు నాకర్థమైంది నాన్న వర్క్ ప్రెజర్ వల్లనే అప్పుడలాచేసాడని
తనకుతనవాళ్ళ మీద వల్లమాలిన  ప్రేమాభిమానాలున్నా
యని నాకర్థమైంది
మునుపెన్నడూ నాన్నను నేనలా చూడలేదు
ప్రతిమనిషి  సున్నితమనస్కుడే అలాగే మానాన్న కూడా
సందర్భాన్ని బట్టి తన పసితనం
(సున్నితత్వం) బయటపడుతుంది అని అప్పుడే నాకు అవగతమైంది




కామెంట్‌లు