ఒంగోలులో కవి రాజేంద్రప్రసాద్ కు నరసం సత్కారం

 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం(నరసం), ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొని మాతృభాష ముచ్చట్లు అనే కవితను చదివారు. సభాధ్యక్షులు శ్రీమతి తేళ్ళ అరుణగారు, ముఖ్య అతిధి శ్రీ నాగభైరవ ఆదినారాయణ గారు  మరియు ఇతర అతిధులు కవులు కవిత మరియు గానము రెండూ బాగున్నాయని మెచ్చుకున్నారు, కరతాళధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో కవియిత్రి శ్రీమతి క్రిష్ణవేణి పరాంకుశం గారిని, నటుడు శ్రీ మల్లికారునరావు గారిని మరియు నృత్య మాష్టరు శ్రీ బాలకోటయ్య గారిని ఙ్ఞాపికలతోను, ప్రశంసా పత్రాలతోను మరియు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమం బాగా జరిగిందని ఆహ్వానితులు తమ సంతోషం వ్యక్తపరిచారు.
కామెంట్‌లు