సుప్రభాత కవిత ; -బృంద
తూరుపింట వెలిగే మంట
కొండలమధ్య హోమగుండమట
నింగికెగసిన జ్వాలలట
ఒంగి చూసిన గగనమట!

అగ్నిహోత్రుడు బహుమతిగా
అవనికిచ్చిన జ్యోతికలశపు
అపరంజి  కాంతులు నిండి
అంధకారం పరుగుతీసెనట!.

ఇలకు దిగివచ్చిన ఇనుడి కిరణాలు 
ఇంపుగ భువిని తాకినంతనే
ఇంతింతైన పుడమి సోయగాలు
ఎంతో వెలిగిపోయాయట!

బారులు తీరి జలదాలన్నీ
అచ్చెరువుగ ఆగి చూస్తూ
వెలుగుపంట సిరి తాకి
కెంపుగ మారి మురిసెనంట!

పగడం ముత్యంగా
ముత్యం కెంపుగా
కెంపు వజ్రంగా మారుతున్న 

మెరుపులు ఎంతో అద్భుతమట!

మనల కన్నతండ్రి
మహరాజులా వెలుగుతూ
మన ఇంటి ముంగిలిలో
మనోహరంగా అడుగుపెట్టేవేళ

మదిపాడే

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు