శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
261)వర్ధనః -

ఆశ్రితులను వర్ధిల్లజేయువాడు


శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
262)వర్థమానః -

విశ్వరూప వృద్ధికలిగినవాడు
వర్ధిల్లజేయునట్టివాడు
పెరుగుతుండునట్టుజేయువాడు 
రెట్టింపునందించగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
263)వివిక్తః -

ఏకాంతమునున్నట్టి వాడు
పవిత్రమైన చోటనుండువాడు
విభిన్నమైనట్టి స్థానమున్నవాడు
వివేకమును ఒసగుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
264)శృతి సాగరః -

శృతులకు సముద్రంవంటివాడు
వేదములు గలిగియున్నవాడు
మంచివిషయాలు తెలుపువాడు
సద్విషయాసక్తి నిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు
265)సుభుజః -

జగద్రక్షణ గావించునట్టివాడు
విశాలభుజములున్నవాడు
భారదక్షత గలిగినవాడు
జనులను భరించుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు