కవి సోమన్నకు ఘన సన్మానం


 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాల్ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త,బాలబంధు గద్వాల సోమన్నను శాఖ గ్రంథాలయం,ఆలూరులో ఘనంగా సన్మానించారు."చీకటి-వెలుగులు" శ్రీ సవ్వప్ప గారి ఈరన్న పుస్తకావిష్కరణకు విశిష్ట అతిథిగా వెళ్లిన,అర్థ శతక పుస్తకాలు ముద్రించిన బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను పుస్తక రచయిత సవ్వప్ప గారి ఈరన్న,గ్రంథ స్వీకర్త విశ్రాంత మండలాధికారి శ్రీమతి హెచ్. రామలింగమ్మ , విశ్రాంత యం.ఆర్.ఓ శ్రీ షేక్షావలి మరియు విచ్చేసిన ప్రముఖులు వీరి విశేష తెలుగు సాహిత్య కృషికి కొత్త బట్టలు పెట్టి, శాలువా,పూలమాలతో సత్కరించారు.అనంతరం కవి సోమన్న మాట్లాడుతూ "మాతృభాష తెలుగు పరిరక్షణ అందరి బాధ్యత " అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి శ్రీ నీరుగంటి వెంకటేశ్వర్లు,పద్య కవి శ్రీ ఈశ్వరప్ప,కళాకారుడు శ్రీ రంగన్న,శ్రీ నల్లారెడ్డి,శ్రీ భాస్కర్ గౌడ్,శ్రీ వీరాస్వామి,శ్రీ రామ్మూర్తి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు