సుప్రభాత కవిత ; -బృంద
ఎంతోసేపు ఎదురుచూపు
కనుల ముందుకు విందుగా
శిఖరాల కనుబొమల మధ్య
పగడాలు పొదిగిన బొట్టులాగా....

తలవంచి పీటలపై కూచున్న
వధువు లాగా కళ్ళెత్తి చూస్తూ
కోటికాంతులు మెరవగ
వరుని చూసి నవ్వినట్టూ....

దూరాన నిలుచున్న భక్తునికి
కామాక్షి శిరమున మకుటపు
మధ్యలోని రత్నపు మెరుపు
మాత్రమే కనిపించినట్టూ....

ద్వారాన వేచిన భక్తులకు
ఓరగ తెరచిన వైకుంఠపు
తలుపు సందుల నుండి
మాలక్ష్మి ముక్కుపుడక మెరిసినట్టూ..

ప్రసవ వేదన మరచి తొలిసారి
పసిబిడ్ఢను  చూసిన తల్లి
కన్నుల లాగా నీరునిండిన
చూపుల నిరీక్షణ తీరేలా

తరలి రమ్మని తండ్రిని
మరి మరీ తలచి పిలిచే
పిలుపు వినపడి ప్రభువు
కనుల ముందుకు తరలి వచ్చు

అరుణోదయ తరుణానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు