సౌందర్య లహరి - కొప్పరపు తాయారు
🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

అమూతేవక్షోజావమృతరసమాణిక్యకుతుపౌన సందేహస్పందో నగపతిపతాకే మనసి నః ।
పిబంతౌయస్మాదవిదితవధూసంగరసికౌ
కుమారావద్యాపిద్విరదవదనక్రౌంచదలనౌ ॥ 73 ॥

వహత్యంస్తంబేరమదనుజకుంభప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ ।
కుచాభోగో బింబాధరరుచిభిరంతః శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే ॥ 74 ॥

73) అమ్మా! హిమాలయకీర్తి ధ్వజమైన ఓ జగజ్జననీ!
 సూర్యచంద్రుల పోలిన నీ స్తనములు అమృత రసముతో నిండిన మాణిక్య పాత్రలు.  సూర్యుడిలో పోషకాలు ,చంద్రుడులోని ఔషధా గుణాలు కలిగి ఉన్నావు. ఆవిషయంలో మాకే విధమైన సందేహమూ లేదు. అమృత రస పూర్ణ  మాణిక్య రసామృత పాత్రతోసమానమైన నీ స్తనముల అమృతాన్ని గ్రోలిన గజాననుడు సుబ్రహ్మణ్యడు
 ఇప్పటికీ స్త్రీ సాంగత్యం కోరని వారై అమృతానందములోఉన్నారు. గజాననుడికున్న బుద్ధి సిద్ధి ఆయన శక్తులు. మనం ఏ పని అయినా బుద్ధిపూర్వకంగా చేస్తే తప్పక సిద్ధింప చేస్తాడు. వల్లీ దేవసేనలు సుబ్రహ్మణ్యుడి శక్తులు. వల్లి అంటే సన్నని తీగ వంటి కుండలనీ శక్తి.
స్కంద ఆరాధనతో లో ఉన్న శక్తులను పైకి తీసుకురాగలిగితే దేవసేన లనబడే మన ఇంద్రియాలను సరియైన మార్గంలో పెట్టి తరింప చేస్తాడు కదా! తల్లీ!
74) అమ్మా! నీవు ధరించిన హారాన్ని గజాసురుని కుంభస్థలంలోని మణులతో గుచ్చబడి స్వచ్ఛమైన 
నీ బింబాదరము వంటి అథరోష్టకాంతితో చిత్రవర్ణం కలదై ముత్యాల హారాన్ని మహాదేవుని ప్రతాప యుక్త యశస్సువలె ధరిస్తున్నావు కదా! తల్లీ !
     ***🌟***
🌟 తాయారు 🪷

కామెంట్‌లు