వెలుగు కోసం చీకటితో
యుధ్ధం
అంతులేని ఆశలతో
రేపటికై సిధ్ధం
క్షేత్రంలో మొలకెత్తిన
బీజం
సమయ సీమ ముగిసాక
ధాన్యంతో సిధ్ధం
మోడున కనిపించే చిగురు
నీడనిచ్చే వృక్షంగా నిలిచేందుకు
సిధ్ధం
నొప్పించిన గాయాలన్నీ
అనుభవాలై పోరాటానికి
కావాలి సిధ్ధం
ఎదురు చూసిన క్షణాలన్నీ
ఎడతెగక శ్రమించి
ఎదగడానికి సిధ్ధం
తగిలిన రాళ్ళే పునాదిగా
విజయపు కోట కట్టుకోడానికి
సిధ్ధం
అపజయం ఇచ్చిన అవమానం
ఆయుధంగా విజయం
సాధించడానికి సిధ్ధం
అవకాశం అందుకుని
అహరహం శ్రమింవి
గెలవడానికి సిధ్ధం
అనుకున్నది సాధించి
అపహసించిన వారికి
బదులివ్వడానికి సిధ్ధం
అరుగాలం శ్రమించిన
చేతికందిన పంట
కోతకోయడానికి సిధ్ధం
పసుపుకాంతులు విరిసి
పసిడి వెలుగులు కురిపించు
ప్రభాకరుడికి ప్రణతులంటూ
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి