కాపాడండి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మొక్కలు మీరూ నాటండి
చక్కగ పాదులు చేయండి
చుట్టూ కంచెను చుట్టండి
రోజూ నీటిని పోయండి
ఎదుగుదలను వీక్షించండి
మొక్కలు పెరిగి చెట్లవునండి
మొక్కలు, చెట్లు మన నేస్తాలేనండి
కలుషితవాయువు తాను గ్రహించి
ప్రాణవాయువును మనకిచ్చునండి
కూడూ, గూడూ, గుడ్డలనిచ్చి
ఆకులు, పువ్వులు, కాయలు, కూరలుగా
బెరడూ,కాండం,వేళ్ళతోసహా
మందులు,పండ్లూ ఎన్నో ఇచ్చి
మనకు తగిన ఆహారమిచ్చి
తోడూనీడగ ఉంటాయండి
మేఘాలతోనీ దోస్తీచేసి
హాయిగ వర్షాలను కురిపించునండి
కాలుష్యానికి విరుగుడు మంత్రం
వృక్షాలేనంటే నమ్మండోయ్
ప్రతిఒక్కరూ ఒక మొక్కను నాటి
రాబోవు తరాలను కాపాడండి
చెట్టు నరకడం హత్యేనండి
ఈ హత్యే భావితరాలకు శిక్షండి!!
**************************************

కామెంట్‌లు