సౌందర్యలహరి ;- కొప్పరపు తాయారు
  🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

స్ఫురద్గండాభోగప్రతిఫలితతాటంకయుగలం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ ।
యమారుహ్య ద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే ॥ 59 ॥

సరస్వత్యాః సూక్తీరమృతలహరీకౌశలహరీః
పిబంత్యాః శర్వాణి శ్రవణచులుకాభ్యామవిరలమ్ ।
చమత్కారశ్లాఘాచలితశిరసః కుండలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ 

59) అమ్మా! నీ వదనమే రధం దానికి గల నాలుగు నీ
చక్రాలే వేలాడే రెండు కర్ణ పుష్పాలు,రెండుబుగ్గలపై
వాటి ప్రతిబింబాలు అయి ఉన్నాయి.శంకర  రధం
పృధ్వీ, దానికి  సూర్య చంద్రులే చక్రాలు కదా తల్లీ !
దాన్నిఅధిరోహించి పరమశివుడు త్రిపురాసురులను ఓడించాడు! కానీ ఇక్కడ పరమశివుని వదన రూప 
రధాన్ని ఆశ్రయించు కారణంగా మన్మధుడు శంకరుని ఎదురై యుద్ధం చేయా సాహసించాడు కదా తల్లీ !
60) ఓ శర్వాణి! అమృత లహరి కౌశలాన్ని కూడా హరించినట్టు సూక్తి శ్రవణా రూపాంజలుతో 
అవిరళంగా పారణ చేసే సమయంలో నీ కర్ణ కుండలాలు చమత్కార పూర్వోక్తుల సాకారంగా అనుక్షణం వంగుతూ ఓంకారోత్సారణ సద్రుసంగా
ఉంకారధ్వారా బదులుపలకు పలుకుతున్నాయన్న
 ట్టు ఉన్నాయి. పూర్వకాలం అనుజ్ఞాసూచనతో
ఓమ్ పలుకుతుండ గా ,వారు ప్రస్తుతం ఆ _ఉ.అన్నట్టుగా ఉంది. తల్లీ !
                        ***🌟***
🌟 తాయారు 🪷

కామెంట్‌లు