ముందునిలవరా!- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 
గగనమంత నిండగా నినదించరా
కణకణమున దేశభక్తి రగిలించగా
స్వాతంత్ర్యమే మన హక్కని చాటాలిరా
మంత్రమదియె మనగుండెలొ నిలవాలిరా
గాములరేడుగ నీవు జగతిన వెలగాలిరా
నిజమెరిగిన ప్రపంచము తలవంచునురా
మనమునిండుగా నిన్ను దీవించునురా
కుతంత్రమేదైనను కూలదోయుమురా
సూత్రధారివై నీవు ముందు నిలవరా
ఆముగల వైరిని అణగదొక్కరా!!
---------------------------------------------------


{గాములరేడు=సూర్యుడు;ఆము=మదము}
**************************************
కామెంట్‌లు