'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 53.
చంపకమాల.
నరకుని సంహరించనట నాతిని తోడ్కొని విక్రమించి యీ
ధరణిని గావగన్ జనులు తద్దయు వేడ్కగ బెట్టి దీపముల్
మురియుచు నిన్ను దల్చి తమ మ్రొక్కులు  భక్తిగ
దీర్చగన్ వెసన్ 
గరుణను జూపువాడ!నను గాంచవె నిత్యము ప్రీతిగన్ హరీ!//

54.
ఉత్పలమాల.

కుంతిని జేరదీసి తన కూరిమి పౌత్రుని రక్షచేసి నీ
వంతయు చక్కబెట్ట పరమాదరమొప్పగ సన్నుతించి నీ
చెంతనె చేరి పాండవులు శ్రేయము నొందిన లీల వింటి నా
చింతలు బాపరావ!దరి చేర్చెడి దైవము వీవె శ్రీహరీ!//

కామెంట్‌లు