తీగల వంతెన ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
మనసుకు దగ్గరున్న 
చిరకాల మిత్రత్వం తీగలవంతెన నవ్వే
నన్నూపిన కొమ్మ ఊయల మతికొచ్చేలా

ఊహలలూపిన ఊయలమనసేదో 
తేలే తీగల వంతెన విహారం 
వికసిత ఆనంద నృత్యసీమలో

రంగుల కలలు అరచేతిలో
రంగవల్లులు మట్టి ఎదలో ఎగిసే
తెల్లని రంగున హరివిల్లు విన్యాసం

మనిషంటే హోలీ రంగులాట
కలామతాలకతీతమైన మనిషి 
ఆడే ఆటలో తలెత్తుకున్నదే సంతోషం

ఆట నీదే ఆడేదీ నీవే 
ఒంటరిగా కాదు నలుగురితో  
కలిసిన మైదాన ఆటే ఆరోగ్యం

క్లాక్ టవరైనా కమానైనా కరీంనగర్ 
మానేరైన గలగలల కవితా ప్రవాహమే
తీగల వంతెన బతుకుదారి మజిలీ మాత్రమే

నింగీ నేలను కలిపే
స్నహబంధమే తీగల వంతెన  
తడిసే భావోద్వేగాల రెక్కల నదిపై


_________
కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Yes,it is the talent of the poet even to feel a strong emotion for small issues.description with beautiful diction and.refence to the places are highlights.congrats