పసి పిల్లలు;- -గద్వాల సోమన్న, 9966414580
పసి పిల్లలు వేల్పులు
పవిత్రమే మనసులు
పాల వంటి  పలుకులు
పూల లాంటి తనువులు

పలుకులేమో సత్యం
పసి వారే ముత్యం
చక్కని బాటలోన 
నడపాలోయ్ నిత్యం

బలే బలే పిల్లలు
అందమైన మల్లెలు
వెలసిన హరివిల్లులు
విరిసిన విరిజల్లులు

వెన్నెలమ్మ చినుకులు
వెన్న వోలె తలపులు
సన్నజాజి తావులు
చిన్నారుల ఊసులు

కపటం లేని బాలలు
ప్రకాశించు సూర్యులు
భారతీయ వీరులు
కాబోయే పౌరులు

ఇంటిలోన దివ్వెలు
కంటిలోన పాపలు
చూడు చంటి పిల్లలు
దేశానికి ఎల్లలు

కామెంట్‌లు