చురకల సుర కత్తులు;-గద్వాల సోమన్న,9966414580
కోపతాపాలకు చోటు
ఇచ్చావా! బహు కష్టము
రాగద్వేషాలకు స్థానము
కల్పించావా! విలయము

పచ్చని కాపురాల్లో
చిచ్చు పెట్టావా! ఛిద్రము
విలువైన స్నేహంలో
వేలుపెట్టావా! ద్రోహము

బద్దకానికి స్వాగతము
పలికావా! వినాశనము
శ్రమించక పగటి కలలు
 కన్నవా! ప్రగతి శూన్యము

నైతిక విలువలు బ్రతుకున
క్షీణించాయా! పతనము
జన్మించిన పూజ్యులను
మరిచవా! దురదృష్టము

కామెంట్‌లు