వోని లో పోలియో చుక్కల ప్రచార ర్యాలీ
 వోని గ్రామంలో పోలియో చుక్కల ప్రచార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఎంతో విలువతో కూడుకున్న ఈ పోలియో చుక్కలను ఉచితంగా పొంది పోలియో వ్యాధి నివారణకు తోడ్పడాలని అన్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ రెండు పోలియో చుక్కలు వేయించేలా తల్లిదండ్రులు పెద్దలు బాధ్యత వహించాలని అన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు, తరిమేద్దాం తరిమేద్దాం పోలియో వ్యాధిని తరిమేద్దాం, పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దుతాం అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎ.ఎన్.ఎం. ఆరిక సుశీల, సచివాలయం ఆరోగ్య సంక్షేమ విభాగ ప్రతినిధి ఎం.ఎల్.హెచ్.పి. కిల్లాడి అనూష,  
ఆశా కార్యకర్తలు టి.హైమవతి, వి.నీలవేణి, సి.హెచ్.డబ్ల్యు డి.హరిత పాల్గొన్నారు.
కామెంట్‌లు