కవిత్వం అంటే;- కె.కవిత-: హైదరాబాద్.
కవితా దినోత్సవం సందర్భంగా
======================
అక్షర పదాల మాలిక
కలం నుంచి జాలువారే గీతిక
అందంగా రూపుదాల్చు జ్ఞాపిక...

నిగ్గదీసి అడుగును జనాన్ని..
ఒగ్గనే ఒగ్గదు ఎవరికీ..
అధినేతలైనా జంకాలి కవిత్వానికి..

అనుభవంతో రాసేవి కొన్ని
యదార్థ సంఘటనలు రాసేవి కొన్ని
అందరి మనసుల్ని తాకేలా రాసేవి కొన్ని..

ఎత్తుగడల ప్రవాహ ఝరి..
అంత్య ప్రాసల చమత్కారి
కలాల మధ్య హోరాహోరీ!!

కామెంట్‌లు