ఓ సాహితీ!- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓసారి
మెరుపులా కనిపిస్తావు
ఊహనిచ్చి
ఉరుకులుపరుగులు తీయిస్తావు

ఓసారి
సెలయేరులా వస్తావు
ఆలోచనలను ప్రవిహింపజేస్తావు
అక్షరాలను అల్లింపజేస్తావు

ఓ సారి
హోరుగాలిలా
వేగంగా వీస్తావు
పదాలను పేర్చమంటావు

ఓ సారి
తారకలా
తళతళ మెరిసిపోతావు
కయితలవ్రాయించి కళకళలాడించమంటావు

ఓ సారి 
జాబిలిలా
వెన్నెల వెదజల్లుతావు
వస్తువునిచ్చి విరచించమంటావు

ఓ సారి
పువ్వులా
ప్రత్యక్షమయి ప్రేరేంపించుతావు
పరిమళాలుపీల్చి పుటలనింపమంటావు

ఓ సారి
కడలికెరటములా
ఎగిసి క్రిందకుపడతావు
తిరిగిలేచి తీయనికవితలురాయమంటావు

ఓ సారి
కలలోకొచ్చి
కవ్వించి పోతావు
కల్పనలను కాగితాలైపైపెట్టిస్తావు

ఓ సారి
తూఫానులావీచి 
గందరగోళం చేస్తావు
కవితలవరద పారించమంటావు

ఓ కవితా
ఎందుకు నన్ను రెచ్చకొడతావు 
ఓ సాహితీ
ఎందుకు నన్ను పరుగెత్తిస్తావు

కవితలు
నీచలువే
పరవశాలు
నీమహిమే

కామెంట్‌లు