సురక్షితం- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 యమలోకపు ద్వారాలు
తెరుచుకొని చూస్తున్నవి
"ఎవరు వస్తరా" అని
ఎదురుచూస్తూ ఉన్నవి
యమభటులు అటూ ఇటూ
తేరిపార చూస్తున్నరు
"ఎవరినెత్తుకెళదామా" అని
నిరీక్షిస్తూ ఉన్నరు
"హెల్మెట్ పెట్టుకొనని వారెవరు?
సీటుబెల్టు పెట్టుకొనని వారెవరు?
రాష్ డ్రైవింగ్ పౌరులెవరు?
తాగి డ్రైవింగ్ బాబులెవరు?
నిర్లక్ష్యపు నడక గాని,
నిర్లక్ష్యపు డ్రైవింగ్ గాని
ఎవరు? ఎవరు? ఎవరు?
ధూమ్రపాన, మద్యపాన
వీరులెవరు? శూరులెవరు?"
అంటూ నిరంతరం
అన్వేషిస్తూ ఉన్నరు
ఆ యమభటులు
మరి...........
మనం అందులో ఒకరం
కాకుండా ఉందాం!
సురక్షితముగా ఉందాం!
అంతా ఆనందంగా ఉందాం!!!
*********************************
కామెంట్‌లు