సుప్రభాత కవిత ; -బృంద
తొలికిరణపు నులివెచ్చని
పలకరింపు
అపుడే విరిసిన పువ్వుల
పులకరింపు

పుడమి మొత్తం ఆవరించి
పుత్తడిలా మురిపించే
ప్రభాత కిరణాల
సోయగం అద్భుతం!

చూపు సాగు దారిలో
ఇరువైపులా విరిసిన
ఊదాల అందాలు
మదిని నింపు ఆహ్లాదాలు

ప్రతి క్షణమూ అమూల్యం
ప్రతి సుమమూ అపూర్వం
ప్రతి దినమూ  ప్రభవించు
ప్రభాకర బింబము అద్భుతం

బ్రతుకు బాటలొ ప్రతి దినమూ
సంతోషాలు వెదుక్కుంటూ
ప్రతిక్షణమూ ప్రేమ పంచుతూ
ప్రకృతితో  చేయాలి సావాసం

ఇవ్వడం ఇచ్చినంత తృప్తి
మరిక దేనిలోనూ దొరకదు
తీసుకోవడమే కాదు అది
తెలుసుకోవడం సంతృప్తి

అందరి సౌఖ్యం కోరడం
అనాదిగా మన ఆచారం
అందరిలో మనముండాలని
అనుకుంటే  ఆనందం

అరోగ్యభాగ్యమిచ్చే ఆదిత్యునికి

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు