కర్మ సిద్ధాంతం;- సి.హెచ్.ప్రతాప్
చేసిన కర్మలకు ఫలితమనుభవించక తప్పదు
సక్రమ ప్రవర్తనే కాపాడుతుంది
నీతి, నిజాయితీలతో కూడిన ప్రవర్తన
సదా భగవన్నామస్మరణ
పరులకు చేతనైనంత సేవ
సదా సమాజ శ్రేయస్సు కొరకు
చిత్తశుద్ధితో కృషి చేయడమే
మనకు అవుతుంది శ్రీరామరక్ష
భగవంతునికి చెడు అంటే గిట్టదు
దురాశ, రాక్షస ప్రవృత్తి
హింసా నైజం, పరుల దూషణం
ఇత్యాది దుర్గుణములతో
చెడు పంధాలో పయనించు వారికి
అన్నటికైనా తప్పదు వినాశనం.
భక్తి కర్మను ధ్వంసం చేసి
విముక్తి వైపుకి తీసుకెళుతుంది.
కర్మ అంటే ‘కార్యాచరణ’, ‘స్మృతి’
కార్యాచరణ లేకుండా స్మృతి
స్మృతి లేకుండా కార్యాచరణా ఉండదు
కర్మ మీరు చేసే పనుల్లో లేదు
అది ఉద్దేశంలో ఉంటుంది
జీవిత విషయాలలో లేదు
వాటి సందర్భం కర్మను సృష్టిస్తుంది
ఎరుకతో చేసే పని కర్మను ఉత్పన్నం చేయదు
ప్రతిక్రియ మాత్రమే చేస్తుంది
ధ్యానపరులైన వారే
కర్మ నుండి విముక్తులవుతారు
కామెంట్‌లు