బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
 తొట్టంబేడు:
అభం,శుభం తెలియని బాల్యం లో వివాహాలు చేసి పిల్లల భవిష్యత్తు ను 
నాశనం చేయకూడదని దిగువ సాంబయ్య పాళెం ప్రధానోపాధ్యాయు
రాలు జ్యోతి అన్నారు.శివరాత్రి బ్రహ్మో
త్సవాలను పురస్కరించుకుని ప్రాధమిక
పాఠశాల మరియు అంగన్వాడీ సంయు
క్తంగా గ్రామంలో బాల్య వివాహాల నిర్మూ
లన కార్యక్రమ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లా
డుతూ రేపటి భవితకు బాలలే వారధు
లని మానసిక, శారీరక పరిపక్వత 
రాకుండా వివాహాలు చేయడం వలన ఒక తరాన్ని నష్టపోవల్సి వస్తుందని
అన్నారు.ఈ కార్య క్రమంలో అంగన్
వాడి సిబ్బంది మోహన రాణి,ఆశ వర్కర్ దుర్గ,కిశోర బాలికలు, తల్లిదండ్రులు,
విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు