ఓసారి మాఊరుకి పోవాలి;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మా గ్రామం
పోవాలి
నా బాల్యం
తలచాలి

ఏటిలో
ఈదాలి
గట్టుపై
తిరగాలి

ఇసుకదిబ్బలపై
కూర్చోవాలి
ప్రాణమిత్రులతో
కబుర్లుచెప్పుకోవాలి

చెరువులో
ఈతకొట్టాలి
చేలలో
చకచకానడవాలి

గుడిలోకి
వెళ్ళాలి
వేణుసామిని
కొలవాలి

పాతబడిని
చూడాలి
అప్పటిగురువులను
తలచాలి

పెద్దలతో
మాట్లాడాలి
పిల్లలతో
కోతలుకోయాలి

తోటల్లో
తిరగాలి
మాటల్లో
మునగాలి

బావిలో
సేదవేయాలి
బిందెలతో
నీరుతోడాలి

కావిడి
ఎత్తుకోవాలి
కుండలు
మోయాలి

ఆటలు
ఆడాలి
పాటలు
పాడాలి

మిత్రులతో
మాట్లాడాలి
విందుభోజనము
చెయ్యాలి

అమ్మను
ఆరాధించాలి
నాన్నను
ధ్యానించాలి

నాటుకోడికూర
తినాలి
మోటుసరసాలు
ఆడాలి

మా ఊరిఘనతను
చాటాలి
మా పుట్టిననేలను
పూజించాలి

కామెంట్‌లు