ఇంద్రధనస్సు రంగులే జీవితం నిండా
పర్వదినాన తిరిగి వర్ణాలే
తత్వాన్ని పిచికారీ చేయగా
వయస్సు ఉషస్సు కోరుకుంటూ
అజ్ఞాన తమస్సును అప్పుడప్పుడు వెడలగొట్టుచుండు
జీవనాన వసంతోత్సవమే కదా
ఎల్లవేళలా
రాక్షసమయమైన అంతఃశ్శత్రువులను తరమగా
జగము నిండిపోయెను వేడుకల్లో
కామదహనమై నిశీధిన ఎగసిన జ్వాలల్లో మానవాళి మోదమంద
అనేక రంగుల కలయికలో
ఏకత్వమే లోకాన కనబడగా
పండుగ గుండె నిండుగా
ఆటపాటలతో హోళీ ఇల
వర్ణవర్షమే కురిపించెను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి