శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
386)సంస్థానః -

గమ్యస్థానము తానైనవాడు
జీవులకు స్థితినిచ్చుచున్నవాడు
సముచిత స్థానమిచ్చువాడు
దివ్యమగు స్థానమిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
387)స్థానదః -

కర్మలనుబట్టి నిలుపువాడు
సత్కర్మకు సత్ఫలమిచ్చువాడు
బుద్ధిప్రకారం నడిపించేవాడు 
కర్మననుసరించి బ్రోచువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
388)ధృవః -

అవినాశమైనట్టి వాడు
ధృవీకరించబడిన వాడు
స్థిరమైనట్టి చోటున్నవాడు
ధ్రువతారవలే నిలుచువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
389) పరర్థిః -

ఉత్కృష్టము అయినట్టి వాడు
పరమర్థించు భక్తులున్నవాడు
దేవతలలో శ్రేష్ఠమైనవాడు
మోక్షమడుగు అర్హతున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
390)పరమస్పష్టః -

స్పష్టంగా తెలుసుకోగలవాడు
తేటతెల్లము అయినవాడు
మహిమలు చూపించు చున్నవాడు
భక్తులను అనుగ్రహించు వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు