కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప నుంచి మ అనే ఐదు అక్షరాలకు అగ్గి దేవత జయం అని  జయమును కలుగ చేసేది  అలాగే అగ్నికరంలోని య,ర,ల,వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత సర్వేశ్వరి  శాసించే శక్తి కలది సర్వేశ్వరి  ఆఖరిలోని 5 అక్షరాలైన శ,ష   స,క్ష  హా చ  లకు అధిదేవత కౌగిలి  ఈ అదిదేవతలను అందరినీ వాగ్దేవతలు అంటారు అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం ఒక దేవత శక్తి ఉంది ఎందుకంటే  శబ్దం బ్రహ్మా నుంచి ఉద్భవించింది  అంటే బ్రహ్మమే శబ్దము ఆ బ్రహ్మమే నాదము మనం నిత్యం జీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై ప్రకృతి పై ప్రభావం చూపుతాయి అదే మంత్రాలు వేదవ అయితే ఇంకా లోతుగా  ప్రభావం చూపుతాయి. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాలను ఉచ్చరించి అమ్మవార్లను అర్జిస్తున్నాయి  కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా వేదమంత్రాలు సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్పందనలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు  మనం చదివే స్తోత్రం ఎక్కడో ఉన్న దేవుడిని దేవతను ఉద్దేశించి కాదు మనం చదివే స్తోత్రమే ఆ దేవత మనం చేసే శబ్దమే ఆ దేవత మన అంతః చేతనలో ఉండి పలికిస్తున్నది ఆ శక్తి మన ఉపాస్య దేవత  ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత ఎంత అద్భుతం ఇది సనాతన ధర్మం ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం  కనుక  మాతృ భాషను మాతృభూమిని మాతృదేవతను  చులకన చేయడం పరిపాటి అయిపోయిన ఈ రోజుల్లో అర్థం తెలిస్తే  కొంతైనా ప్రయోజనం ఉంటుందని ఈ  ప్రయత్నం. మనం చేసే పనిలో నిజాయితీ మన మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంతవరకు  ఎదుటివారు ఎంత పెద్దమనిషి అయినా భయపడవలసిన అవసరం లేదు  కనుక మనం  మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి  మనిషికి అద్భుతమైన రెండు వరాలు ప్రకృతి ఏర్పాటు చేసింది  ఏ మనిషి అయినా తన మరణం ఎప్పుడు అది ఏవిధంగా సంభవిస్తుందో వారికే తెలియక పోవడం  తనతో ఉన్న   బంధువులు గాని ఈ స్నేహితుడు కానీ మిత్రుడు కానీ  ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉన్నా  నిజంగా వారి మనసులో మనల్ని గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియక పోవడం  ఈ రెండు గుణాలు మనిషికి ప్రకృతి ఇచ్చిన వరాలు  లేకుంటే ప్రతి క్షణం నరకాన్ని అనుభవించబడిసి వస్తుంది



కామెంట్‌లు