ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నాకు నాటి మేటి కళాకారులు అందరితో నటించే అవకాశం ఇచ్చారు బందా కనక లింగేశ్వర రావు గారు  వారందరితోనూ నెగ్గుకు వచ్చాను నా వయసు వారితో బాగా  నటించాను అందరి మెప్పు పొందాను చిన్నపిల్లలతో నటించడం మంచి అనుభూతిని మిగిల్చింది  నాకు నచ్చిన ఏకైక బాల నటి సీత బాలమురళీ గారిని మరిపించే ఎన్సివి జగన్నాథచార్యులు గారి గారాల పట్టి అందమైనది  సంగీత సాధనలో పరిణతి  కలిగినది చక్కటి విమర్శకురాలిగా ఆ రోజుల్లోనే అంత చిన్న వయసులోనే అలరించిన చిన్నారి  సీత  ఎం సి ఆనంద్ మావయ్య గారు అలా చెప్పారు ఏమిటి ఆ కీర్తన వేరే కదా లింగరాజు శర్మ మామయ్య గారు అలా మాట్లాడుతున్నారు ఏమిటి ఇలాంటి విమర్శలు వాళ్ళ నాన్నగారి ద్వారా పంపించేది తులనాత్మక పరిశీలన ఆమెకు చిన్న వయసులోనే అలవడింది
ఒక శ్లోకం అనవలసి వచ్చినా ఓ పదం పాడవలసి వచ్చినా గోష్ఠి సంభాషణ చెప్పవలసి వచ్చినా ఒక్కసారి చెప్తే చాలు ఏకసంధాగ్రాహిగా ధారణ చేసి సాధన చేసేది అంత చిన్న వయసులో అందరి మన్ననలను పొంది  మా అందరినీ దుఃఖ సాగరంలో ముంచి అతి చిన్న వయసులోనే భౌతికంగా మా అందరికీ దూరమైంది ఆ చిట్టి తల్లి  ఆ బంగారు తల్లిని చూసి  అంతిమ నివాళులు అర్పించడానికి  నేను శర్మ గారు వెళ్ళాము. అక్కడ సీత తల్లి అమ్మాయికి ఎండ తగులుతుంది కొంచెం ప్రక్కన నీడలో పెట్టండి అనగా తట్టుకోలేని తండ్రి జగన్నాథ ఆచార్యులు గారు పొగిలి పొగిలి  దుఃఖించటం ఈనాటికీ మా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఆ దిగులుతోనే తండ్రి కుమిలి పోయారు.నాకు లింగ రాజు శర్మ గారికి మంచి విమర్శకురాలు దూరమైంది.
ఆ సీతతో నాటకం చేయడం నా అదృష్టం ఆ పాపతో పాటు గాన కోకిల కర్ణాటక సంగీతానికి మణి మకుటం  శ్రీరంగం గోపాల రత్నం గారు ప్రత్యేక వేషాల్లో రాణించే బందా గారి నాటకమంటే  తానేనని రుజువు చేసుకున్న ఎం నాగరత్నమ్మ గారు  సున్నిత చక్కటి సన్నని గొంతుతో శ్రోతలను అలరించే డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని  (యూఎస్ఏ) లో స్థిరపడ్డారు గారు అటు హస్య బ్రహ్మ నండూరి సుబ్బారావు గారు నాకు తండ్రి వేషాలు తానేనని శ్రోతలలో ముద్రపడిన సి రామ్ మోహన్ రావు గారు  మా నిలయ ఏకైక ప్రతి నాయకుడు ఎం వాసుదేవ మూర్తి నటించడం నా అదృష్టం కాక మరి ఏమిటి?

కామెంట్‌లు
Saahitya Abhimaani చెప్పారు…
ఎబి ఆనంద్ గారు అద్భుతమైన నటుడు.
ప్రభోధాత్మక నాటకాలలో హీరో వెయ్యాలంటే ఆనంద్ గారే
ఆయన నాటకాలు రేడియోలో వింటూ పెరగటం
నాకు ఆనందాన్నిచ్చిన్నది.

-శివరామప్రసాద్ కప్పగంతు