ఆకాశవాణి విజయవాడ కేంద్రం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 ఆ సంవత్సరంలో గుంటూరులో కాంగ్రెస్ మహా సభలు జరిగినప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీ ప్రసార శాఖ మంత్రిగా ఉండి ఆ సభలో పాల్గొని మన ప్రత్యేకత చాటుకున్నది  ఆ సభలు అయిపోయిన తర్వాత విజయవాడ సెంటర్ కు వచ్చారావిడ దాదాపు గంటన్నర  ఆలస్యమైంది  ధర్మాన్ని చాటి ఇది నా తప్పు కాదు రోడ్డు బాగు చేస్తూ ఉండడం వల్ల జరిగిన పొరపాటు అని  తన నియమపాలనను సరిపెట్టుకుంది ఆమె పక్కన ఒక నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి రాఘవమ్మ గారు కూడా వచ్చారు  త్వరగా మా కళాకారులను పరిచయం చేయమంటూ ముందుకు నడిచారు. అప్పటికే మేము సమావేశమై కూర్చున్న స్థలంలో ఖాళీగా ఉంచి రేడియో కేంద్ర సంచారకున్ని ఇంజనీర్ని రెండు కుర్చీలలో కూర్చోబెట్టి వారి వెనక అధ్యక్షులను ఆఫీసు ఉద్యోగులను నిలబెట్టి వారి వెనుక నాలుగో తరగతి ఉద్యోగులను ఉంచి ఆ గనక అంటే చివరి వరుసలో మమ్మల్ని   నిలబెట్టారు.
అప్పటికే ఇందిరా గాంధీ తోపరిచయమున్న మా శ్రీవాత్సవ యండమూరి సత్యనారాయణ పరిచయం చేయగానే మా కళాకారులు ఎక్కడ అని ప్రశ్నించింది ఇందిరాగాంధీ  చివరి వరసలో అనగానే ఆమెకు వచ్చిన కోపాన్ని దిగమింగుకుంటూ చూడండి శ్రీ వాత్సవ గారు రేడియో బ్రతికిందంటే కళాకారుల వల్ల సితార్ సహానాయీ లాంటి వాద్య కళాకారులు చక్కగా నాటక సంభాషణలు చర్చగాను గోష్టిగాను మంచి రచయితలు వాటికి ప్రాణం పెట్టిన కళాకారుల కంఠాల వల్ల ప్రధాన పాత్ర వహించే వాళ్ళను చివరన నిలబెట్టడం ఏమిటి అని  మళ్ళీ ముందు వరుసలోకి పిలిచి అందరితో కరచాలన చేసి నవ్వుతూ మీ కష్టాలు ఏమిటి చెప్పండి అని అడిగారు. ఆంధ్ర భాష తప్ప మరి ఏ భాషా తెలియని వారం మేమంతా ఒక హిందీ అనువాదకుడు  మమ్మల్ని ఉద్దేశించి మీలో హిందీ తెలిసిన వారు ఎవరంటే రాచకొండను చూపించారు  శ్రీ వాత్సవ గారు రాచకొండ వారిని చూడగానే నమస్తే పితాజీ అన్నారు ఆవిడ నిజ జీవితంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ని పితాజీ అని పిలుస్తారు  రాచకొండ వారు కూడా గడ్డం చిన్నకోటు ఆకారం అది ఠాగూర్ లాగే అనిపించి అలా సంబోధించాను మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా  అన్నారు ఆవిడ  చిరునవ్వు చిందించి రాచకొండ వాడు భారతదేశానికి వన్నె తెచ్చిన గొప్ప కవితో పోల్చడం నా అదృష్టం అలాగే పిలువండి అన్నారు.

కామెంట్‌లు