మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అధికారి వారి తోట  తిరుమల పడమర మాడవీధిలో పడమటివైపు వెంకటగిరి రాజావారి తోట అందులో ఒక మండపము ఉండేది అందులోకి స్వామి వారు వస్తూ ఉండేవారు ఎందువలనో అవన్నీ  ముగిసిపోయి వారు ఆ తోటను అమ్మివేశారు దానికి ఆనుకొని హత్తీ రాంజీ మఠం వారి తోటకూడా ఉంటే అధికారి రామలక్కన్ దాస్ వెంకటగిరి రాజా గారి తోట కొని తమ తోటలో కలుపుకొని దానిని విషయాలను చేశారు. ఒక మంచి మండపాన్ని నిర్మించారు.మిగిలిన జాగాలో ఒక సత్రం కూడా నిర్మించారు రామ భక్తుడు కనుక ఆలయంలోని సీతారామ లక్ష్మణులు పునర్వసు నక్షత్రం నాడు ఆ మండపానికి వచ్చే ఏర్పాటు చేసినారు  మహంతుల పాలనంతమయ్యేనాటికి ఆసత్రం కూలిపోయింది మండపాన్ని ఆధునీకరించి దేవస్థానం వారు దానిని వసంత మండపమని పేర్కొని ప్రస్తుతం వసంతోత్సవాలు జరుపుతున్నారు.
మైసూర్ గవర్నమెంట్ వారి సత్రం  1824 వ సంవత్సరంలో వసంత మండపానికి దూరంలో అదే వరుసలో మైసూర్ సత్రాలు ఉన్నాయి  ఒకప్పుడు మైసూర్ మహారాజు గారు నిర్వహించేవారు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం వారు ఆస్థానం ఆక్రమించి ఆలయ మర్యాదలు స్వీకరిస్తూ ఉంటారు మాస్టర్ ప్లాన్ అమలు చేసినప్పుడు అదృశ్యం కాకుండా నిలిచినవి ఈ పై రెండు మాత్రమే దేవస్థానము సత్రము శృంగేరి మఠము ఓం సాయి మండపము ఇప్పుడు లేవు   మైసూర్ గవర్నమెంట్ వారి సత్రం వైశాల్యం కలిగి ఉన్నది ఇది చాలా కాలం నుంచి ఉండి ఈ సత్రంలో ఏకాదశి రోజున తప్ప తక్కిన రోజులలో యాత్రికులైన బ్రాహ్మణులకు మధ్యాహ్నం ఒక పూట శ్రీవారి దేవస్థానంలో నివేదన అనంతరం భోజనం పెట్టేవారు వంట చేసుకోవడానికి దిగటానికి స్థలాన్ని ఇచ్చేవారు ఈ సత్రంలో పూర్వం కొంతకాలం భోజనం పెట్టక సామాన్లు ఇచ్చి  వాడిని వంట చేసుకోమని చెప్పేవారు. ఈ సత్రానికి ప్రక్కన మరొక సత్రం ఉంది ఇది శిథిలమైనదని దేవస్థానం వారు కట్టడానికి ఏర్పాటు చేయబోతున్నారు శృంగ గిరి స్వాముల వారి మఠం ఈ వీధిలో తూర్పు శ్రేణిలో చిన్న ఇల్లు ఉంది ఉత్తర వీధిలో పూర్వం పెద్దమఠం పెరడు ఉన్నాయి అది శిథిలమైన తర్వాత నిధి ఏర్పాటయింది ఈ మతానికి దేవస్థానం నుంచి నిత్యం  పోరవెత్తము బియ్యము మామూలు ఉంది  గోసాయి మండపం వాయువ్య మూలలో గోసాయి అనగా రైలు లేని కాలమున దేశమంతా తిరిగి దేవస్థానమునకు మూడుపులను జనములను తీసుకొచ్చేవారు  మంటపము చిన్న గుంట కలవు శ్రీవారి బ్రహ్మోత్సవానికి గోసాయి జెండాతో వస్తుంది. ఈ జెండా ఊరు బయటకు రాగా దేవస్థానం వారు మేడతాళములు పంపించి ఊరు బయట నుంచి ఈ గోసాయి మండపంలో ప్రవేశించువరకు దేవస్థానం వాద్యాలతో తీసుకు రాబడతాయి.



కామెంట్‌లు