ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వీరి ఉదాహరణకు ధీటుగా విలియం షేక్స్పియర్ ని ఉదాహరిస్తూ రెండు మూడు ప్రయోగాలు స్వామి చెపితే ఇది షేక్స్పియర్ స్టైల్ అన్నారు రామనరసింహం గారు  అది వారి స్టైల్ అయితే ఇది చిన్మయ స్టైల్ అంటూ పకపకా నవ్వుతూ వేదిక దిగివచ్చి ఖద్దరు పంచి లాల్చి తొడిగి భూమికి మూడు అడుగుల ఎత్తున మా గురువుగారిని హత్తుకొని ఇన్ని రోజులు నా ఉపన్యాసం ప్రతి వాక్యాన్ని విని జ్ఞాపకం పెట్టుకొని వ్యాకరణ దోషాలను కూడా చెప్పిన మీ మేతకు అభినందనలు అని గురువుగారిని వేదికపైకి తీసుకువెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేసి శాలువా కప్పి సత్కరించారు ఇన్ని రోజుల సన్నిహిత పరిచయంతో ఒకరోజు విశ్రాంతిగా ఉన్న సమయంలో స్వామీజీని నేను  స్వామీజీ నాకు రెండు సందేహాలు ఉన్నాయి  అడగమంటారా అంటే నిశ్చింతగా అడగమన్నారు. మీరు ఎంఏ చదివే అంతవరకు ఈ వేదాంతలు గాని గురువులు కానీ వారి బోధలు కానీ తెలియవు మీ గురువుగారి దగ్గరికి బూట్లు వేసుకొని వెళ్లి కాలు మీద కాలు వేసుకునే ప్రశ్నించేవారు కదా ఇప్పుడు ఇంత స్థితికి ఎలా వచ్చింది అన్నాను  ప్రతివాడికి అహం వుంటుంది అహం బ్రహ్మాస్మి అని ఉపనిషత్ వాక్యం కదా అది ఉండవలసినది తనపై తనకు నమ్మకం లేకపోతే మనిషి బ్రతకలేడు ఈగో సూపర్ ఈగో అప్పటికి నాకు అహంతో పాటు కారం కూడా పెరిగి అహంకారం సూపర్ ఈగో గా మారింది మా గురువుగారి కలువ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల ఆ కారాన్ని తగ్గించుకో గలిగాను కనుకనే స్వామిగా మారాను మీ అభిమానాన్ని పొందగలుగుతున్నాను అని చెప్పి నీ రెండో ప్రశ్న ఏమిటి అన్నట్లుగా చూసారు.
మా నాన్నగారు మేము అందరం ఏర్పేడు సద్గురు మలయాళ స్వామి వారి శిష్యులం అద్భుతమైన వారి గీత కఠోపనిషత్ వ్యాఖ్యానం చదివాను కూడా వాక్యాలు పేర్చడం తప్ప మీరు వారు రాసిన గీత కఠోపనిషత్తులలో విషయం అదే కదా స్వామి అంటే దానికి ఆయన పకపకా నవ్వి నేనూ సద్గురువే కాదు ఎవరు ఎక్కడ గీతను కానీ ఉపనిషత్తులు గాని చెపుతారో వారంతా ఇలా చెప్పవలసినదే ఎందుకంటే అది మా సొంతం కాదు కృష్ణ పరమాత్మ సృష్టి వ్యాసమహర్షి ప్రోక్తం నా స్వాకపోల కల్పితాలు దానికి పనిచేయవు అని ఎంతో సహృదయంతో మా కళాశాలకు వచ్చి విద్యార్థులు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవలసిన అవసరాల గురించి విషిధ పరిచారు.
కామెంట్‌లు