స్నేహితుడు (హితం కోరువాడు);- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640 748497
 తల్లి
తండ్రి
 గురువు
ఆ తర్వాత స్థానం
స్నేహితుడు
మనహితం కోరేవాడు
ఎటువంటి రక్తసంబంధం
ఎటువంటి రాగ బంధం
ఎటువంటి బంధుత్వం
లేని అజరామరమైన బంధం
తల్లి కుమారుడి కడుపాకలి చూస్తుంది
తండ్రి కుమారుడి ఎదుగుదలను చూస్తాడు
గురువు  అజ్ఞానాంధకారం బాపి
జ్ఞానాంజన దిద్దుతాడు
స్నేహితుడు మన మనసెరిగి
మన కళ్ళలోని ఆర్తి చూసి
అపన్నా హస్తమందించి
బాధలోఓదార్పునిచ్చి
మన సంతోషంలో భాగమై
మన దుఃఖంలో  భుజం తట్టి
నేనున్నానని
 ధైర్యాన్నదించి
కడవరకు కట్టే కాలే వరకు
మనల్ని వీడని
మన నీడగా
వెన్నంటి నడిచేదే
నిజమైన స్నేహం
అటువంటి స్నేహితులకు
మనఃపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

కామెంట్‌లు