ఒకటి;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
ఒక్కమాట
ఓదార్పు నివ్వగలదు
బ్రతుక్కి భరోసా నివ్వ‌గలదు

ఒక్క నవ్వు
అశేష స్నేహ సుమాల్ని
పూయించగలదు

ఒక్క మొక్క
విశ్వచైతన్యానికి
అంకురార్పణ కాగలదు

ఒక్క మోదం
ఆత్మానందాన్ని
ఆవిష్కరించగలదు

ఒక్క ఆశ
నిస్సహాయమైన
బ్రతుక్కిదారిదీపమవగలదు

ఒక్క చేయూత
వేయి ఏనుగుల
 బలాన్నివ్వగలదు
బ్రతుకును గెలిపించగలదు

ఒక్క ఓటు
ప్రజల దశాదిశమార్చగలదు

కామెంట్‌లు