ఏపార్టి మ్యానిఫెస్టో
చూసినా?!
ఏముంది
గొప్ప
అన్నీ వండీవార్చిన
ఉచిత హామీలేతప్పా
బరిలోని అభ్యర్థులు
ఎన్నెన్నో --నేర్చిరి--!?
గజకర్ణ,గోకర్ణ టక్కుటమార
విద్యలెన్నో---!?
ఓటర్లకు
మద్యం డబ్బు సరేసరి!
ఓటుకు విలువ కట్టడం!
ఎరవేసిన ఓటుగాలానికి
చిక్కడం ఓటరు వంతు
మాయింటి ఓట్లు మేము
అమ్ముకోము
ప్రజల ఉద్యోగ ఉపాధులు
మేము కూల్చుకోము
ఉద్దెరప్రసంగాలతో
ఉద్వేగాలు రెచ్చగొట్టే
నయవంచనకు
పాల్పడే బడాచోర్
నాయకులు
మాయమాటలతో
మనింటికి వస్తున్నారు
జర భద్రం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి