ప్రజాస్వామ్యం వర్థిల్లాలి;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
ప్రజాస్వామ్య పడితీస్తుంది
వ్యక్తి స్వామ్యం(నియంతృత్వం) రాజ్యమేలుతుంది

ఎన్నికల్లో ఎన్నెన్నో కళలు
చూపి
గెలుపు తలుపు తట్టాకా
ప్రజల్ని పాలనను
గాలికొదిలేసారు

రాజకీయాలు చూసే
రంగుల మార్చే
ఊసరవెల్లి ముఖం చాటేసింది

నేను ఆత్మరక్షణ కోసం
రంగులు మారుస్తా
అడుగడుగునా అవినీతి
ఆశ్రిత పక్షపాతం
స్కామ్ లు స్కీములు
ఇదే కదా దోపిడీకై వల్లెవేసే
మూలసూత్రాలు

ప్రలోభపెట్టడం 
దుర్మార్గుడైన పాలకుడి
గెలుపు తంత్రం

తలొగ్గితే రాష్ట్రాన్ని
మొత్తం ఊడ్చేయడం
అతగాడి నిత్య వ్యవహారం 

ఏమరుపాటుగా ఉండొద్దు
ప్రజలచేత ప్రజలకొరకు
ఏర్పడిన ప్రజా ప్రభుత్వాలను
సజావుగా నడవనిద్దాం
ఓటు ఎవడోఒక్కడి ఆయుధం కాదులే 
సుపరిపాలనకోసమై
అర్హత గల ఓటర్లంతా
సమిష్టిగా ఎన్నుకోవలసిన
ప్రజాపాలన క్రతువు



కామెంట్‌లు