పేగు బంధం అమ్మది;-అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
పేగు బంధం అమ్మది
ప్రేమానురాగబంధం
అమ్మది
అమ్మ గర్భమే దేవాలయం
అమ్మ ఒడి మన తొలి బడి
అమ్మ మన తొలి గురువు
త్యాగానికి ప్రతీక అమ్మ
మానవ జన్మప్రదాయిని అమ్మ
నిత్యం మనముందే నడయాడే
ప్రత్యక్షదైవమే అమ్మ
సహనానికి సాక్ష్యం అమ్మ
భూమాతలా కుటుంబ కొరకు (చుట్టూ)
నిరంతరం పరిభ్రమించే భూమాతే మా అమ్మ
ఆగనికాలసూచి అమ్మ
అచంచల ఆత్మవిశ్వాసం మా అమ్మ
ఆదివారమైనా సెలవులేని,వేతనమాశించని నిస్వార్థసేవకురాలు అమ్మ
మన బంధువులను పరిచయం
చేసింది అమ్మ
మనీ మేనేజ్మెంట్ తెలియని నాన్నకు టిప్స్ ఎన్నో నేర్పింది మన అమ్మ
ఇంటాబయటా బహుముఖీయంగా  తన ప్రజ్ఞాపాటవాలతో గెలుపు సంతకమే మన అమ్మ
వసుధైక కుటుంబానికి మూలవేరే మన అమ్మ
సంసార సాగరంలో ఎన్నిఆటుపోటులొచ్చిన
తట్టుకొని నిలిచిన వటవృక్షమే
మన అమ్మ
అమ్మ ఋణం తీర్చలేనిది
అమ్మ మనకు బిడ్డగా పుడితే
తప్పా ఆతల్లి ఋణం తీర్చలేము
అమ్మ ప్రతిప్రాణికి చిరునామా
అమ్మ మనకు ఆత్మీయ నేస్తం
అమ్మే మనకు ఓదార్పుగీతం
అమ్మ మన పంచప్రాణం


కామెంట్‌లు