ఓటంటే
సామాజికాభివృద్ది
ఓటంటే
సామాన్యుడికి
రాజ్యాంగం అందించిన
వజ్రాయుధం
ఓటంటే
అమ్మ
అది అమ్మేదికాదు
ఓటంటే
ఆత్మగౌరవ ప్రతీక
ఓటంటే
రాజరికానికి
చరమగీతం పాడి
సామాన్యుడికిబ్రహ్మారథం
ఓటంటే
ఓటరు గెలుపు
ఓటంటే
ఎగుడుదిగుడుగా ఉన్న
సంఘాన్ని సమతలంచేసేది
ఓటంటే వ్యక్తి స్వార్థం కాదు
ఓటంటే
సామాజిక న్యాయం
(ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థను
సుస్థిర పరిచేది
ప్రతిఒక్కరూ ఓటెయ్యాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి