పర్యావరణాన్ని కాపాడుకుందాం;- అంకాల సోమయ్య దేవరుప్పుల జనగాం 9640748497
నాకిప్పుడు పెద్దసుత్తె ఒకటి కావాలి 
గల్లి గల్లి లోని కాంక్రీట్ రోడ్లను
బ్రద్దలు కొట్టడానికి
భూతల్లిని సిమెంట్ భూతంనుండి
కాపాడడానికి

భూభారాన్ని తగ్గించడానికి
భూతాపాన్ని తగ్గించడానికి 
ప్రతివర్షపు చుక్క నేలలో ఇంకేలా చేయడానికి 
భూగర్భజలాలను పెరిగేలా చేయడానికి 
త్రాగు సాగు నీటికి కటకట రాకుండా చూడడానికి 
//
అందుకే నాకిప్పుడు పెద్దసుత్తె ఒకటి కావాలి //
నేను పట్టణాలు గ్రామాల్లో 
ఖాళీ స్థలాల్లో
 అడుగునా విరివిగా మొక్కనాటమని ఎలుగెత్తి చాటుతాను

ఇంటింటికి ఇంకుడు గుంతలు తవ్వమని 
విరివిగా ప్రచారం చేస్తాను

చిప్కోఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని
నేను ప్రతిచెట్టును ఆలింగనం చేసుకుంటాను
చెట్లు నరకొద్దని చెట్లు పర్యావరణాన్ని కాలుష్యరహితంగా
చేస్తాయని
ఈ చెట్లు భూమికి ఊపిరితిత్తులు
అని మరీమరీ చెబుతాను
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని నినదిస్తాను
రేపటి రోజున నీటి యుద్దాలు రావొద్దంటే 
నేటి నుండే నీటిని
పొదుపుగా వాడమని హితబోధ చేస్తాను 
ఈ అతివృష్టి ,అనావృష్టి ,సునామీ 
వడగండ్లవానలు,  నిప్పులు కక్కే ఈ ఎండలు, పిడుగుపాటు
మన పర్యావరణ వ్యతిరేక చర్యల  ద్వారానే జరుగుతాయని ఘంటాపథంగా చెబుతున్నాను
సర్వేజనాసుఖినోభవంతుకామెంట్‌లు