దారి;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
\ఏ నిర్వచనానికి దొరకదు 
బతుకు సమీకరణాన్ని సాధించదు
తిరుగే దారైనా సాగే తొవ్వైనా 
స్థిరత్వంలేని తికమకే బాట వారసత్వం  

నడిచిన దారి సరళరేఖ వెలుగు తీరైనా
వంకరటింకరలు తిరిగిన పాము లాగైనా 
ఏదైనా ఎలాగైనా ఆగక నడక 
సాగింది అటో ఇటో సజీవంగా

ఉదయ భానుడు తూర్పున
అస్తమించే సూర్యుడు పడమట
ఊదేసే గాలి ఉత్తరదిశలో
దాహం తీరని వాన ఎండా దక్షిణ దిశలో 
నలువైపుల కలిసి కదిలే  కూడలి దారెంట నా మనసును పలకరించే

ఈతి బాధలు చూసే కనులవే
మూతి విరుపులు పలికే చెవులవే
బతుకు కాచిన మనసు దారి దొడ్డది 

స్నేహాలూ ప్రేమలూ ప్రకృతి పూచిన పూలు
వాసనలు విరిసి విస్తరించిన దారి
జనజీవన రహదారి సంతకం

బంధాలూ అనుబంధాలూ అన్నీ
పిడికిట దాగినవే క్షేమంగా
ఊరూ నారూ మట్టిసీమ పుటుకే
అంతుచిక్కనిదీ అగమ్యమైనదీ  
అతుకుల గతుకుల దారి మనిషి

లక్ష్యంలేని యాత్రలో దారినడక తిరోగమనం
దారిచొచ్చి సాగే ప్రయాణం ఏ వెలుగు తీరాలకో మరి
ఆలోచిస్తే మనిషి
నడక నడత మార్చుకున్న 

దారులన్నీ మంచివే మరీ గొప్పవే

కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Daari edainaa gamyam okate
Aatma sakshaathkaaram& paramaatma lo eykyam kaavadam.Deham& Manasu pette ibbandulu ,meerane eethi badhalu thappavu.jeevithaani nirvachansm undadu.prayathinchadam vyartha prayasam. Bhavanaathmaka kavitha ..supurb.Abhinamdanalu